మూతి ముద్ర

మూతి ముద్ర

ఎండలకాగలేక గోలచేస్తే

అమ్మ బట్టలన్నీ తీసి

గోచీ మాత్రం వదిలింది పాపం

 

అడగకడగక ముద్దాడిగాడట అత్తను మామ

మూతి ముద్ర అందంగా పడాలని

ఎదురుగా ఉన్న నాపై డెమో ఇచ్చి చూసుకుంది

 

ముద్దు ముద్ర సరిగా రావటం లేదని ఒకసారి

అసలు ముద్రే పడటం లేదని ఒకసారి

రంగు ముదురుగా ఉందని ఒకసారి

రంగు తేలిపోయిందని ఒకసారి

 

నా ఒళ్ళంతా ఇలా మూతి ముద్రలతో నింపేసింది

ఇంకా నయం… అమ్మ గోచీ అన్నా ఉంచింది

 

అత్త ముద్దు ఎలా ఉన్నా…

నన్ను మాత్రం డెమో పేరుతో బలిచేసేసిందిగా

ఇప్పటికైనా ముద్దు సరిగా పెడితే సరి… లేకుంటే ఏమవుతుందో నా పరిస్థితి.

రచన: శాంతి కృష్ణ

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!