చిన్ని కిట్టయ్య

చిన్ని కిట్టయ్య

ముద్దులొలికే మురళీ కృష్ణుడు, 

తేనె పెదవుల చిన్ని కృష్ణుడు,

పాలు కారే పసిడి బుగ్గలతో, 

ముద్దులు మూట కడుతున్నాడు. 

 

చూడగానే నచ్చేసాడేమో, 

అతివల మనసు దోచేశాడేమో,

మూటకట్టిన ముద్దుల ముత్యాలు,

ఆ ముద్దు వర్షంలో తడిశాడేమో.

 

వేయి కన్నులు కూడా చాలవు

ఆ అందాన్ని చూడగా…

కోటి ముద్దులు కూడా తక్కువే

ఆ పసి తనాన్ని పలుకరించగా.

 

పసిపిల్లల రూపంలో చిన్నికృష్ణుడు, 

చనుబాలు తాగే ఆ బాల కృష్ణుడు.

ప్రతి మనిషి జీవితానికీ ఓ వరం

చిన్నపిల్లవాడు ముద్దుగా మురిపించాడు

                       రచన: పి. వి. యన్. కృష్ణవేణి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!