శివశక్తి 

శివశక్తి 

రచయిత:సత్య కామఋషి ‘ ఏకలవ్య ‘

అఖిలాండ కోటికీ అన్నపూర్ణవే 
నీవు, నా తోడుగా లేకున్న…
ఈ లోకాలను నేను నడుపజాల…! 

సమస్త జగతికీ మూలాధారమగు 
ప్రకృతివి నీవు, నా జతకాకున్న 
పరమపురుషుడనై సృష్టిని 
ఒంటిగా నేను నడుపజాల…! 

విశ్వాన్ని నిలిపేటి అద్వైత శక్తివే 
నీవు…సగమైన శివ స్వరూపంబునై
లయకారకుడనయ్యాను నేను..!
మన కలయిక అర్ధనారీశ్వరం..,
జీవాధారమగు శివశక్తి స్వరూపం..! 

సిగ్గులొలికించేటి నీ సరసమైననూ..
చిరునగవులనొలకించునే నీ మోము..,
విరసపు కినుక వహించిన అలకైననూ..
నిమిషమైన నిలువజాలని నీ మోము.., 

నను చూడనీయని, కంటికి కానరానీయని
నీ పెడమోము ఎడబాటు నేనోపగలనా..?
జగదీశుడనే.. నేను ఆదిపురుషుడను..!
గౌరి లేని శివుడనా… నేను ఆదిభిక్షువును..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!