ఇదేమి నోము
ముత్యమంతా పసుపు ముఖమేంతో ఛాయ!
భర్త కాళ్ళకి పసుపు రాయకూడదే ఛాయా!!
అంటే విన్నావు కాదు, కాదంటే ఊరుకున్నావు కాదు
నేను పేరంటంలో ముత్తైదువను కాను
నాకెందుకీ గోలంటే విడిచిపెట్టేవు కాదు
చీర చుట్టి, గోచి పెట్టి కూర్చుండపెట్టావు
కాళ్ళకేమో పసుపు పేడల్లే అలికావు
నన్ను చూసి నలుగురూ పకపకా నవ్వేరు
ఏ ఏడు కాదంటే పైనేడు చేయొచ్చు నోము
నన్నిలా హింసిస్తే నోము నోచేమి లాభము
కరోనా పుణ్యమాని ఇంట్లోనే ఇరుక్కున్నాను
బయటకెళ్లే దారిలేక ఇలా నీ పాల బడ్డాను
వదలవే నా తల్లి నీకో దణ్ణం పెడతాను!
ఆ నోము ఫలమేదో నీకు దక్కేలా చేస్తాను!!