కరోనా కాలం
కరోనా పెనుభూతం
కబ్జా చేసింది భూగోళం
గాలిలో వేగంగా పయనం
కలుషిత తుంపర్లే తన నిలయం
మానవ దేహంలో తన జీవం
ఇస్తే నువ్వు కరచాలనం
తప్పదు నీ దేహ విధ్వంసం
మందులేని మాయరోగం
సామాజిక దూరమే ఔషధం
మాస్కులే రక్షణ కవచం
ధరించనిచో తన రాకిక సుగమం
ఆరోగ్యమే మహాభాగ్యం
మానవ దేహమే దేవాలయం
పరిశుభ్రంగా ఉందాం ప్రశాంతంగా బతుకుదాం
మహామ్మారాని తిరిగిరాని లోకాలకు తరిమి తరిమికొడదాం నేస్తం…!!
రచయిత :: అలేఖ్య రవికాంతి