ప్రకృతి విలయతాండవం

ప్రకృతి విలయతాండవం

కాటేసే కాలం …
చీల్చి చెండాడుతుంది జీవితం…
ఘోర నిర్లక్ష్యం…
ప్రకృతికి అయ్యేను శాపం…
పచ్చని చెట్లు నేల కూల్చగా…
ప్రాణం పోసే వాయువు…
విషవాయువులై ప్రాణాలు హరించగా…
జీవనాధారాలు కురిపించే నదులు… సముద్రాలు…
కాలుష్య నిలయాలుగా మారగా…
ప్రకృతి జగతిని అల్లకల్లోలం చేస్తుండగా…
సునామీలు… భూకంపాలంటూ…
ప్రకృతి చేస్తుంది విలయతాండవం…
తాను చేసిన తప్పులు సరిదిద్దుకుని…
ముందడుగు వేయవలసినది పోయి…
అంది వచ్చిన అవకాశాలను వదులుకుని…
ఎటో అంతరిక్షము వైపు పరుగులు పెడుతున్నాడు… మానవుడు…

రచయిత :: సావిత్రి తోట “జాహ్నవి”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!