అర్ధ శతకం

అర్ధ శతకం

అర్థశతకం వయసును
చూపుతున్నాయి
వెండి పోగులై
అక్కడక్కడా మెరుస్తున్న కేశాలు

యాభై సంవత్సరాల
కాలం గడిచి
అనుభవాలసారాన్ని
మిగిల్చింది జీవితం

బాధ్యతల బరువులు
కొన్ని దిగితే
శరీరానికి వచ్చి చేరిన
రుగ్మతలు భారమవుతున్నవి..

ప్రాణం పణంగాపెట్టి పెంచుకున్న పిల్లలు
పరిణితి చెంది ప్రయోజకులై
ఎదురుపాఠాలు చెపుతుంటే
అబ్బురమనిపిస్తూ ఉంటుంది …

జననం వలెనే మరణం తప్పదని
తెలిసినా మనసు భీతిల్లుతుంది
వయసు మళ్లుతున్నదని …

ఆత్మబలం ఆయువుగా చేసుకుంటూ
పోగుచేసుకున్న ఙ్ఞానాన్ని
పలువురికి ఉపయుక్తంగా పంచుతూ
దైవానుగ్రహంతో లభించిన
ఈ మానవ జన్మను సార్థకరం చేసుకోవాలి

గడుస్తున్న తరందాటి వచ్చే
ముందుతరానికి ఆదర్శమైన నడవడి
మనదై వారి గుండెల్లో
చిరస్థాయిగా నిలవాలి!!
                                    రచయిత :: సుజాత తిమ్మన

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!