అలుకలో నా సతి

అలుకలో నా సతి

 

రచయిత:శాంతి కృష్ణ

 

అలక బూనిన సతి కులుకులు మురిపెముగ చూసుకుంటు…

మృధుమధురమై ముందుకొచ్చి

అధరములను గ్రోలెవలెనని తొందరపెడుతున్న మదిని నిలువరిస్తూ…

చెలి చెంతకు చేరి అలక తగ్గించు మార్గము శోధించుచుండ…

కోపముచే రవివర్ణమైన నాసిక నుండి

అదురుచున్న అధరముల మీదుగా

చుబుకమును చేరిన సఖుని కరము జూచి,

అలకను మరచి, సఖి చిరుమందహాసము చేసే…!!!

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!