పోతు పేరంటం
సినిమాలో కామెడీ యాక్టర్ శ్రీలక్ష్మి
ఆవిడ ఏ సినిమా చూసిన ఏదొక
వ్రతం చేస్తూ భర్తని హింసిస్తుంటే
చూసి నవ్వుకునే వాడిని నేను
ఇప్పుడు కరోనా పుణ్యమా అని
నేను ఆ భర్త స్థానం లోకి మా
ఆవిడ శ్రీలక్ష్మి గారి స్థానంలోకి
మారుతామని కలలో కూడా అనుకోలేదు
కరోనా వల్ల వ్రతం ఆగితే నేను
పతీవ్రతను ఎలా అవుతాను
అంటూ నన్ను పోతు పేరంటాన్ని చేసి
చీర చుట్టి బొట్టు పెట్టి
పసుపు పూసి గాజులు వేసి
నన్నో పోతు పేరంటాన్ని చేసింది
చూసే వాళ్ళు పగలబడి నవ్వేలా
నన్ను ముత్తైదువు లా చూసిన ఆ
పక్కింటి పరందమయ్యా నవ్విన
నవ్వు చూసి ద్రౌపది నవ్వు గుర్తొచ్చి
మా ఆవిడ కేసి ఓ చూపు చూసి
అసలు అనాల్సింది మా ఆవిడని కాదు
అసలీ పొతు పేరంటాన్ని కనిపెట్టిన
వాడిని పోతుని వేసినట్టు పోలేరమ్మకి
బలి ఇయ్యాలి కత్తి అందుకో జానకి
నాయాల్ది వేసేద్దాం అని అనిపించింది


Wow super హసీనా👌👏🏻👏🏻👏🏻💐😀😀