ప్రకృతి కాంతవై

ప్రకృతి కాంతవై

ప్రకృతి కాంతలో ఎన్నెన్నో లొయలు
ఆ లొయలే నా కవిత్వంలో నీకై
నేను ప్రతి అక్షరం రాసే గానశృతి లయలై
నీ మదిలో ఆనందాలు మీటే సుస్వరాల సంగీతమై

నీలో మదిలోని భావాలకు ఊహకి రెక్కలొచ్చి
నిన్ను నీలాల గగన తలానా వీధిలో గువ్వలవలే
ఎగిగిపోదా నాపై నీ ప్రేమ భాష్యపలుకులు ప్రాణం పోసి
నన్ను నీ ద్వంద బాహువుల్లో బంధించి
నాకు ఊపిరి ఆడనీయకుండా చేసే రోజు రాదా.. !!

ఈ భువనపు వీధిలో గాలికి కదలాడే వృక్షం వలే
నీ పైట కొంగు గాలికి నన్ను తాకి నాలో తన్మయత్వమై
నామదిలోని విరిసే ప్రేమ గగనపు విరితోటలో గులాబీవై
ఈ ప్రకృతిలో పూసిన ప్రతి పువ్వును నేనైతే గీలించి
నీ అందాల శిరోజాల నడుమ చెక్కిచుకుంటావా !!

మేఘాల రాగాల ఆలాపనలో
తొలి తొలి చినుకులే మనిద్దరికీ ప్రేమ సాక్షిగా
నల్లమబ్బులే కమ్ముకున్న మేఘమథనం ఝలించి
నీపైన చిరుజల్లు తొలకరి చినుకులై కురియగా
నీ మెనూ మెలిని తనువు జల్లులై తడిసి ముద్దయిన
నీలో అందచందాలన్నీ నా కనుల కొలనులో ప్రతిబింబిచెను విందుగా నాకు కనువిందువైన
నవ్య సౌగంధిక సోపాన సౌపేతసఖీవై

నీ యెద కనుమలలో జనించిన హృదయ చప్పుడు
సెలయేటి సరిగమలుగా నీలో ప్రధ్వనించిన ప్రేమ బాషలే నాలో ఇవేవో తియ్యని కోరికలను తిర్చినవిగా
నీ ముద్దు గుమ్మా చెక్కిళ్ళను తాకితే సుతిమెత్తనీ
సున్నిత మృదు మధుర కోమలాంగి మృదుకోమలివై

రచయిత :- దాదిగిరి నరేష్ (ఉమాశ్రీ)

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!