జవ్వని
జారుతున్న చినుకు ముత్యాలు
ఆమె నడుమొమ్పు లోని స్వేద బిందువులు
కురుస్తున్న తూరుపు కిరణాలు
ఆమె పాపిటలోని సిందూరపు తీరులు
హిమవన్నగాలు
సంద్రపు దూకుడులు
ఆమె మెత్తటి పాదాల అడుగుల సవ్వడులు
పరిమళాల పువ్వులు
పలకరించే పిల్ల గాలులూ
ఆమె మృదు మధుర దరహాస చంద్రికలు
చండ్రనిప్పులూ
అగ్ని కీలలూ
ఆమె శక్తికి రూపాంతరాలు
ఆమె యుక్తికి భావ గర్భితాలు…
ఆసాంతంగా…
ఆమె
మరో అవని
అవనికీ నింగికీ
సోదాహరణ యవ్వని
రచయిత :: సుధ మురళి
చాలా బాగుంది చెల్లీ👌👌💐💐💐
Simply super