పడతి

పడతి

సుందర సుగుణ అవనిని నేను
సీతమ్మకు తల్లిని నేను
సిరులిచ్చు భూదేవిని నేను

సుకుమార పచ్చని వదనం నాది
నా కన్నులైన కానలను కడతేర్చితిరి
నా గర్భ జలంబును హలాహలం చేసితిరి‌

మోడైన కన్నీటి నా మోము కానలేదా…!
అకృత్యాల నా ఆర్తనాదం విన లేదా…!
అంతమయ్యే నా ఉనికి వేదన తెలియలేదా…!

కర్కశ విష బాహువుల చెర తొలుగునా…?
కుళ్ళిన మీ అత్యాశల మకిలి తొలుగునా…?
రంపపు కోతల మనిషి దుశ్చర్యలు ఆగునా…?

స్వార్థపు మత్తు మైకం మారదే…!?
విశృంఖల వికృత క్రీడ నిలువదే…!?
మారని మనుజులపై శిక్ష అంతమే…

రచయిత::మౌన వీణ

You May Also Like

One thought on “పడతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!