కన్నె గోదావరి
వాగులు…వంకలతో వయ్యారాలు పోయే గోదారమ్మ…
ఊరుకులు పరుగులతో చేరుతుంది…
తన చెలికాడైన సముద్రుని చెంతకు…
వాళ్లిద్దరు సంగమించేలోగా…
ఎన్నెన్ని ప్రకృతి వింతలో…
దారిలో ఉన్న అడవులు… కోనలు …
తమ హాస్య చాతుర్యం తో
వేళకోళమాడుతూ…
సాదరంగా వీడ్కోలు చెప్తున్నాయి.
ఆకాశ వీధిలో మెరిసే మబ్బుతునకలు…
నీ వెంట మేమున్నాం…
అధైర్యపడకంటూ…
ఆమెతో చెలిమి చేస్తూ…
అడుగులో అడుగు కదిలిస్తూ…
మరింత శక్తిని చేకూరుస్తూండగా…
సిగ్గులమెుగ్గయైన కన్నె గోదావరి…
తన ప్రియుని చెంతకు చేరుతుంది…
ఆత్రుతగా
రచయిత:: సావిత్రి తోట “జాహ్నవి”
బాగుంది