అనుభవాల సారం

అనుభవాల సారం

యాభై ఏళ్లు వయసు
కానీ పదహారేళ్ళ మనసు

ఏదో చెయ్యాలన్న తపన
ఏదీ చెయ్యలేని నిస్సత్తువ
తీరీ తీరని కోరికలు
ఇంకా మోస్తున్న బాధ్యతలు

పెళ్ళిళ్ళు అయిన పిల్లలు
అల్లుళ్ళు కోడళ్ళు, మనవళ్ళతో
అల్లుకుంటున్న కొత్త బంధాలు
పిల్లల ముద్దు మురిపాలు, ఆటపాటలతో
అలసిన మనసుకు సాంత్వన
కోసం ఎదురు చూస్తూ ఉండే సమయం

పిల్లలు పెద్దవాళ్లయి చేతికి అందివచ్చిన వేళ
దూరంగా ఎక్కడో ఉపాధి కోసం వెళ్లిపోతే
మానలేని ఉద్యోగంతో,
బంధాలున్న ఏకాకిగా
మళ్ళీ అదే గత పాత జీవితం
తిరిగిరాదు ఎప్పటికీ కరిగిపోయిన కాలం
నెమరువేసుకుంటూ గడిచిపోయిన బాల్యం
కాలం చేసిన గాయాలకు
కొత్త మందు రాసుకుంటూ
గడుపుతున్న రోజులు
మన వైఫల్యాలను అనుభవాలను
భావి తరాలకు పాఠంగా చెప్తూ
ఆశల రెక్కలకి తాళం వేస్తూ
జ్ఞాపకాలతో వెళ్లదీస్తున్న కాలం

రచయిత :: పరిమళ కళ్యాణ్

You May Also Like

2 thoughts on “అనుభవాల సారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!