పేడి పేరంటాలు
బోలెడు బాసాన్లు తోమిస్తివి…
భరించితిని…!
బండెడు బట్టలు ఉతికించితివి…
సహించితిని…!
నడుం విరిగేలా ఇల్లంతా తుడిపిస్తివి…
నోరు మూసుకుని తుడిస్తిని…!
పది రకాలతో వంట చేయిస్తివి…
ఓర్చుకుంటిని…!
చివరికి…ఆ కరోనా బూచి చూపి…
తేరగా దొరికిన నన్ను…
ఇలా చీరచుట్టి పేడి పేరంటాలిని చేస్తే…
ఎలా తట్టుకోగలను…?!
రేపు నేనెలా తలెత్తుకోగలను
చెప్పు ఛాయాదేవీ…!!!
రచన :: చంద్రకళ. దీకొండ