ఒకరి కోసం ఒకరు
ముసలయ్యకు మూడే వచ్చే
ముత్తైదువ నేనే అంటూ
సింగారాలే చేసుకుని
భార్యామణికి ఆర్డరు వేసే
గౌరి వ్రతం చెయ్యమంటూ
గోలచేసి చేయించే…
కళ్ళకు పసుపురాసి
వాయానమిప్పించుకుంటూ….
మొట్టికాయలు మొట్టటమే తెలిసిన
పెళ్ళాం చేత కాళ్ళు పట్టించుకుని
గెలిచానని లోలోన..
గర్వంగా భావించే…
కాళ్ళు పట్టినా…
కళ్ళల్లో పెట్టుకున్నా..
భార్యాభర్తల బంధం
ఎప్పటికీ ఒకరికోసం ఒకరికే కదా!
రచన :: సుజాత తిమ్మన.