చెప్పవే ఓ భార్యామణి..!!
ఏమిటో ఈ వింత…
చూసారా ఎక్కడైనా ఈ తంటా..!
అట్లకాడలు, రొట్టెలకర్రలు చేతబట్టి
కూలేసి కూర్చోబెట్టి
పసుపంటూ, పారాణి అంటూ
స్త్రీలా కొంగు కప్పి…
కరోనా కాల పిశాచి వచ్చిందంటూ…
జనమే కరువయ్యారు అంటూ….
నోములనంటూ, వ్రతాలు అంటూ…
పండుగంటూ, పబ్బనమంటూ…
ముత్తైదువును చేస్తానంటూ…
కంకణాలు కట్టుకుని
నాకీ ఖర్మ ని అంటగట్టడం ఎందుకు?
ఇది నీకు తగునా… చెప్పవే ఓ భార్యామణి..!!
రచన :: సిరి