మనసు-మమత (“మ” అక్షర సుమాంజలి)

మనసు-మమత (“మ” అక్షర సుమాంజలి)
మనసు విలువ తెలుసుకో
మంచి మనసుతో మాటలాడు
మంచితనం మన మంచికే
మరువకు నీ మనసును
మమతల విలువ తెలుసుకో
మనుషుల మమతలు అవసరం!
మంచి మనసుకి మనుషులు దగ్గరవుతారు!
మంచి మమత కలిగిన మనిషిలా!
మానవత్వమున్న మనిషిలా
మనుషుల మధ్య మెలగాలి
మంచి మనిషివనిపించుకోవాలి
మరువలేక నీ చెంతకు మరల మరలా రావాలి!
మరపురాని నీ కృత్యాలు
మదిలో మెదిలేలా ఎదుటి వారి
మనసును పెనవేసుకోవాలి
మమతను పంచు మంచిని ప్రేమించు!
మనసుకి రెక్కలొస్తే మనిషి పతనమే!
మనసు కుదుట పరచుకో
మనుషుల్లో మహనీయుడవనిపించుకో!
మనసు ,మమత నీ
సొంతమయ్యేను!
రచన :: సుకుమార్

You May Also Like

One thought on “మనసు-మమత (“మ” అక్షర సుమాంజలి)

  1. సుకుమార్ గారు మీ మ అక్షర సుమాంజలి చాలా బాగుంది అండి…👏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!