కరోనమ్మకి వాయనం
ఇస్తినమ్మ వాయనం అని నువ్వు అనడం..
పుచ్చుకుంటినమ్మ వాయనం అని నేను అనడం..
ఏంటే ఇది అంటే వాయనం అని నువ్వు అనటం.
అవునా..! అని నేను గంగిరెద్దులా తల ఊపటం..
ఐదు మంది ముత్తైదువులకు ఇవ్వాలని ..
నాతో ఐదుసార్లు చీరలు మార్పించాలని..
ఏమిటో నాకు ఈ వేళ ఈ నాటకం..
పగవాడికి కూడా వద్దు ఇలాంటి పితలాటకం..
పతిదేవుని కాళ్ళు మొక్కటం మన ఆచారం..
పతికి పసుపు పూయటం అనాచారం..
ఏల చెప్పనే ప్రియసఖి నీకు నా ఆరాటం..
ఇచ్చే వాయనమేదో కరోనమ్మకి ఇచ్చి పంపవే
మనకు తప్పుతుంది ఈ పోరాటం..