హోలీ రంగుల కేళి

హోలీ రంగుల కేళి

ప్రకృతి అంతా రంగుల మయం

దేవుడు చిత్రాలు రస రమ్యం

 

వసంతంలో చిగురించే 

పలు వన్నెల పూలు, రెమ్మలు

నలుదిశలా సుగంధాలను 

మోసుకొని వెళ్లే పిల్ల తెమ్మెరలు

 

సప్తవర్ణాల ఇంద్రధనుస్సు 

ఈ జీవిత నావ

హోలీ రంగుల జల్లులతో 

మదిని సేద తీర్చే ఓ జీవన తోవ

 

అందుకే  మనిషి జీవితంలో 

పండుగలు తప్పకుండా రావాలి

చిన్నా పెద్దా, పేద గొప్పా తేడాలు చూపక

అందరూ ఒకటై ఆడాలి ఆనందాల ఈ హోళీ కేళి.

                                 రచయిత:: చల్లా సరోజినీదేవి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!