నాలోని ఉగాది

నాలోని ఉగాది

తెలుగు సంవత్సరాది ఉగాది

శాలివాహన శకానికి నాంది

తెలుగువారి పర్వదినాల పునాది

వసంత గానంతో ఒయ్యారపు రాగల కోయిల కుహుకుహులు

కాలం కదలికలతో వెల్లివిరుయు తరువుల చిగురుటాకులు

చిరు చిటారు కొమ్మన వేలాడు వేపమావి పూతలు

ఋతురాగ మాలికలో విరిసీవిరియని సుమాలు

అయినా నాకు తెలిసి మన జీవితమే షడ్రుచుల సమ్మేళనం

గడిచిపోయిన “తీపి” జ్ఞాపకాలు

పెదవి విరుపుల “పులుపు” పలకరింపులు

హృదయపు దిగువన “చేదు” బాసలు

భరించ వీలుపడని “వగరు” భాద్యతలు

మమ”కారం” కురిపించే మానవత్వపు కన్నులు

మరపురాని “లవణ” మిళిత కన్నీళ్లు

ఇంకా ఎన్నో మరెన్నో మధురానుభూతులు

ఈ ప్లవనామ సంవత్సరానికి మీకివే నా ఘన స్వాగతాలు…

రచన: బండి చందు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!