ఈశా.. గిరీశా..

రచన – సరస్వతినిత్య

పుట్టుకనిచ్చావు పరమేశా
మరణము ఉందట మహేశా
భోళా శంకరా !!!

నీ కనులను మూస్తావట
మాకిచ్చేది జ్ఞానమట

నీ నివాసం స్మశానమట
మాకిస్తావు భవనాలట

నీ దేహం పై చితాభస్మమట
అత్తరులు పుత్తడులు మాకిస్తావట

నీకిస్తే గుక్కెడు నీళ్లట
మాకిస్తావు మోక్షమట

అందరూ వదిలేసిన చోటనే నన్ను పట్టుకుంటావట
నిన్ను పట్టుకునే దారికై అన్నిటిని వదిలేయగలనట

నా కళ్ళల్లో దాగినది రూపమేట
అది చీకట్లని తొలగించే దీపమట
కాల్చేసెను నేను చేసిన పాపమట
అరుణాచలా!!!

You May Also Like

3 thoughts on “ఈశా.. గిరీశా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!