యుగారంభం

యుగారంభం

నక్షత్ర గమనాన్ని

ప్రారంభిస్తూ విష్ణువు

చేసిన యుగారంభం..

చైత్ర మాసం తెచ్చిన

నూతన శుభారంభం..

తెలుగు వారి కొత్త 

సంవత్సర ప్రారంభం…

 

గండు కోయిలల

పలకరింపులు…

మామిడి చివురుల

కొత్త పుంతలు…

వసంతాన్ని వెంట తెచ్చే

ఆహ్వాన పత్రికలు…

 

ఆరు రుచులను ఏకం చేసి

కొత్త రుచిని కనిపెట్టి

ఆరోగ్యాన్ని అందులోన 

కలియబెట్టే కమ్మనైన ఉగాది..

 

తీపి పులుపు చేదు

కారం వగరు ఘాటుల

మిశ్రమమే

మన జీవితమంటు

గుర్తు చేసే ఉగాది పచ్చడి

రుచుల ఆస్వాదనలు…

 

పంచాంగ శ్రవణాల

పలకరింపులు..

కవుల కవనాల

సమ్మేళనాలు..

తెలుగు లోగిళ్ళ

సంబరాలు..

ఉగాది ఉత్సవాలు.

                                                  రచన : టి.స్వప్న ప్రియ

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!