నాన్నేగా వెన్నుదన్ను

నాన్నేగా వెన్నుదన్ను

 

రచయిత:చల్లా సరోజినిదేవి

అమ్మ మనసు కనిపించే వెన్న ముద్ద లాంటిది.
మరి నాన్న మనసు కనపడని వెన్నెముక వంటిది.

కడుపున చినుకై పడినదిగా మొదలు అమ్మతో పాటు మన రాకకై కోటి కన్నులతో,
శత కోటి ఆశలతో ఎదురు చూస్తాడు నాన్న.  

మన ప్రతీ మాట,ఆట,పాట నాన్న గుండెల్లో చిరుగంటల సవ్వడి చేస్తే,
చిరునవ్వులు చిందిస్తూ మురిసిపోతాడు నాన్న. 

అనునిత్యం బిడ్డల క్షేమం కోసం ఎంతటి శ్రమ నైనా ఓర్చుకొని,
రక్తాన్ని చెమట రూపంలో కారుస్తూ ప్రతీ పైసా సంపాదిస్తాడు నాన్న.

తన కంటే గొప్పవారైన తన బిడ్డలను చూసి పొంగి పోతాడు నాన్న. 
మనిషి నిటారుగా నిలబడేందుకు మూలమైన వెన్నెముక లాగా
మన వెనుక వెన్నుదన్నుగా నిలిచేది నాన్న.

 ” నా బంగారు కొండ” అని  సగర్వంగా తన రక్తాన్ని చూసి
తలెత్తి ఛాతీ విరుచుకొంటాడు నాన్న.

 అమ్మ మాత్రమే కాదు మన జన్మకు కారణం
నాన్న కూడా హేతువు అని గుర్తించాలి మనిషన్న ప్రతి ఒక్కరూ. 

అందుకే అమ్మా నాన్నలు కనిపించని దేవుని ప్రతిరూపాలు అని తెలియాలి.
ప్రాణము వున్నంత వరకూ వారిని పూజించి, సేవించుట మన కర్తవ్యం కదా..!

You May Also Like

One thought on “నాన్నేగా వెన్నుదన్ను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!