నాన్నంటే 

నాన్నంటే 

రచయిత:సరస్వతి నిత్య

 

కఠినమెంత చూపినా  కరుణ నిండిన మనసు నాన్న
కలతలెన్నిఉన్నా కనిపించనీయని  మమత నాన్న 

కడుపున మోయకున్నా గుండెలపై మోసేది నాన్న
త్యాగమెంత చేసినా చెదరని చిరునవ్వే నాన్న

అడుగులు వేయటం మొదలు ఆఖరు వరకు అనురాగం నాన్న
కష్టమేదో తరుముతున్నా నేనున్నా అనే ధైర్యం నాన్న 

దేవుని మారు రూపం అమ్మ 
అ ఇద్దరి నిజరూపం నాన్న
మళ్లీ  ఏ అమ్మ కడుపున పుట్టినా …. 
మా నాన్నకు అమ్మ అవ్వాలనుంది 

ఆదరించు వేళ అమ్మలా
దండించు వేళ గురువులా
దారి చూపు వేళ మిత్రుని లా
దయచూపు వేళ  దేవునిలా
బాధ్యతల వేళ కొడుకులా 

వెనక ఉండి ముందుకు నడిపించే నాన్న
ఆ బంధానికి  సరితూగే బంధమే లేని అందమైన 
అనుబంధం నాన్న!!!! 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!