రైతు బిడ్డ మా నాన్న
రచయిత:నారుమంచి వాణి ప్రభాకరి
మా నాన్న ఆ ఊరిలో
ఆయుర్వేద సంస్కృత
విద్య ప్రవీణులు అయినా
ఆయన ధ్యాస అంతా..
పొలం పని మీదనే దృష్టి
అంతా పంటకు గిట్టుబాటు
ఎలా అన్నదే విధ్యను..
తన పంటకు అవసరానికి తగ్గట్టుగా…
కవిత్వం చెపుతూ రైతుల్ని ఉత్తేజపరుస్తూ
ఆరోగ్య అంశాలు చెబుతూ అందర్నీ
ఒక బాటలో నడిపి గ్రామ ఉన్నతి కోరేవారు మా నాన్న…!