మహారాజు

  • మహారాజు

రచయిత:మంజీత కుమార్ బందెల

అలసట ఎరగని మహామనిషి
కోపం తెలియని శాంతమూర్తి
పరోపకారమే తెలిసిన త్యాగజీవి
సమస్యలకు జడవని ధన్యజీవి

ఆడపిల్లలకు నాన్నతోడిదే లోకం
అమ్మ జన్మనిస్తే .. నాన్న ఇచ్చేది జీవితం

రాజ్యం లేని నా తండ్రికి నేనే రాజకుమారి
నా బంగారు తల్లి అంటూ చేసావు మురిపెం 
భుజాలపై ఎక్కించుకుని చూపించావు లోకం

సమాజపు కట్టుబాట్లు పక్కనబెట్టి…
నన్ను స్వేచ్ఛగా ఎగరమన్నావు
నేను కన్న కలలు నిజమయ్యే వరకు అండగా వున్నావు

నా భవిష్యత్తు కోసం నువ్వు పడ్డ కష్టాలు 
కుటుంబానికి దూరంగా చేసిన ఉద్యోగాలు
తినీ తినని ఎన్నో రోజులు
తల్చుకుంటే బరువెక్కే నా కనులు

నీ నిన్నటి త్యాగాలే
నేటి నా విజయాలు

నీ జ్ఞాపకాలే
నను నడిపించే నేస్తాలు 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!