అంశం :: వయ్యారాల జాబిలమ్మ అలిగినవేళ..
ఉత్తరాన సూర్యుడు ఉలికి పడెనేల..
అలక
రచయిత :ఉదయగిరి దస్తగిరి
అలిగిన తరుణి పెదవులపైన
నెలవంక నిదురించు వేళ
చెలి సొగసులు వెన్నెల్లు కురిపించునే
ఆమె తలపుటుయ్యాలలో వలపు ఊగిసలాడనే
అందాల కొమ్మకి పూచిన బంగారు బొమ్మ
రతనాల కొనలో ముత్యాల రెమ్మ
ఈ బంగారు బొమ్మ పంచదార చిలకమ్మ
ఈ వయ్యారాల జాబిలమ్మ
అలిగిన వేళ చూడాలి
ఈ చెలికొమ్మ అందాలు
చిరునగవుల మోములు
జిగిబిగి తళుకులు బిగవుల నగవులు
తలారా స్నానాలు అరబెట్టే నీలాల కురులు
ఇవేగా చెలి సొగసులు
లేతప్రాయాలన్నీ ముత్యమై మెరవగా
దేహ పరిమళాలే మత్తెక్కిస్తుండగా
నిండు చంద్రుడైనా నేల దిగిరాడా
ఉత్తరాన సూర్యుడైనా ఉలికి పడిపొడా….