నాన్న ఎంతటోడో

  1. నాన్న ఎంతటోడో…!

రచయిత: సత్య కామఋషి


నాన్న మనసు కఠినమే..
చల్లని దీవెనల చలువ నీటిని
కనబడనీయక లోలోపల 
దాచుకున్న ముదురు టెంకాయలా..! 

నాన్న పెద్ద రాక్షసుడే….
నా భవిష్యత్తు బాగు కోసం,
నిత్యం చితికిపోతూ నలిగిపోతూ 
తన బాగోగులను మరచిపోయి
కఠోర తపస్సు పూనిన పిచ్చోడు…!! 

నాన్న ఎంత స్వార్ధపరుడు….
నా వేలుపట్టి నడక నేర్పి..నడత నేర్పి…
తన బలిదానాల ఫలితంగా మలచిన
నా విజయాలను తనవిగా భావించి
పొంగిపోతూ..మురిసిపోయే వెర్రివాడు..! 

ఖర్చుచేసే ప్రతీ రూపాయికి లెక్కలేసుకుంటూ
తనకంటూ  పైసాకూడా నిండుగా ఖర్చుపెట్టుకోని పిసినారోడు….
ప్రేమగా, కాదు కాదు, బాధ్యతగా 
పోగేసుకున్నదంతా నాకై ధారవోసి..తాను
శూన్యంగా మిగిలిపోయే వెర్రిబాగులోడు..!! 

నాన్న ఎంత తింగరోడు…నాపైన
ప్రేమనంతా కోపంగా..ఆశీస్సులనే తిట్లుగా
మార్చి…తన ప్రతీ అడుగు నాకోసమే వేస్తూ..
తనకంటూ తానైనా మిగలకుండా పోతాడు..!! 

అయినా… నా గుండెల్లో…తనదైన స్థానంలో
ఎప్పటికీ నాలోనే…నాతోనే ఉంటాడు …
ఎందుకంటే..నాన్న ఏమిటో నాకు తెలుసు గనుక..!

You May Also Like

One thought on “నాన్న ఎంతటోడో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!