అన్ని అయిన ఒంటరి 

అన్ని అయిన ఒంటరి 

 

రచయిత:ఇత్నార్క్

 

రాక్షసుడిలా కనిపించే మంచి మనసున్న

కరుణామయుడు..

శాంత గుణాలను పైకి తెలియనివ్వని మౌన

శాంతమూర్తి ..

తన సంతోషాలను త్యాగం చేసే త్యాగమూర్తి.. 

చిన్న చిన్న తప్పులను సరిదిద్ది పెద్ద పెద్ద

తప్పులకు అడ్డుకట్ట వేసే గురువు …

పిల్లలు ప్రయోజకులు అయితే నలుగురికి

చెప్పుకుని సంతోషించే చిన్నారి …

పిల్లల కోరికలు తీర్చడానికి రేయి పగలు

విశ్రాంతి లేకుండా పనిచేసే శ్రామికుడు …

ప్రేమను పిల్లలకు అందిస్తే గారాబం చేస్తారని

తన ప్రేమను చూపించని యోగి ..

చివరికి పిల్లలకు భారం అయ్యి 

వృద్ధాశ్రమంలో గడిపే అనాథ…  

 

You May Also Like

2 thoughts on “అన్ని అయిన ఒంటరి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!