నేను నా బంగారం టకీలా

 నేను నా బంగారం టకీలా

పెళ్లి చూపులకైతే తయారు చేశారు

ఆ పిల్లకు నేను నచ్చుతానేమో

ఎలా ఈ పెళ్లి చూపుల్లో నేను నచ్చకుండా చెయ్యాలి

నా బంగారానికి ఇచ్చిన మాటను ఎలా మరువను

అసలే అది నన్ను మోసం చెయ్యవుగా మనుషుల లాగా అందే

హ హ వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే ఐడియా

 

నాకు మటన్ ముక్కలు తినటం నచ్చదు

పెరుగు అన్నం తింటానే

మీ పిల్లకు అదే పెడ్తా చెప్తా 

అది వాళ్లకు నచ్చదు కదా

అసలే ఆ పిల్ల బొద్దుగా ఉంది 

బాగా బొమికలు చికెన్లు మటన్లు 

లాగిస్తుందేమో

 

నా పిల్లను పెళ్లి చేసుకోకుంటే అది చచ్చిపోతుంది 

అని మా నాన్నకు చెప్పాలి అని ఉంది

కానీ దాన్ని ఎవరికన్నా అమ్మేస్తాడేమో అని భయంగా ఉంది

దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నావ్ అంటే ఏమి చెప్పాలి నాన్నకు…

 

అదిలేని జీవితం నాకు వద్దు అని చెప్పాలి

దూరంగా వేరే చోటికి వెళ్లి నా బంగారంతో

నాలుగు ముక్కలు రెండు ఎముకలు తింటూ

ఇరవై మంది పిల్లలను కని జీవించాలి అని కోరిక

ఎలాగబ్బా ఇది తీరటం..

హ వచ్చిందిలే ఒక ఐడియా 

ఒక జీవితాన్నే మార్చేలా…

 

వాళ్ళ నాన్న అమ్మ మనకు బాగా తెలిసిన వాళ్ళు

ఆ పిల్లను పెళ్లి చేసుకుంటే రోజు మటన్ తీసుకొస్తుంది

ఎక్కడ నుండైనా ఎలాగైనా అని చెప్పేస్తా..

 

నా బంగారమేమో జెర్మన్ షెఫర్డ్ బ్రీడ్ టకీలా

నేనేమో లాబ్రెడార్ బ్రీడ్ భూజో

మాకు పుట్టే పిల్లలేమో మిక్సడ్ బ్రీడ్.. 

లలలలా లలాలల..!

                                                                                                                                                                                                                                                                                   రచయిత:విజయ మలవతు

You May Also Like

One thought on “నేను నా బంగారం టకీలా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!