మరపురాని పేజీలు

మరపురాని పేజీలు

ఏ చీకు చింత లేక
ఆనందంగా గడచి పోతే
చాలనుకునే జ్ఞానం
యాభై వసంతాల కాలం…

జీవితానుభవాలను
తరచి చూసుకుంటూ
ఆలోచించి అడుగులు
వెయ్యాలనుకునే ఆలోచన…

బిడ్డలతో తీర్చుకోలేని
ఆట పాటల సరదాలను
మనుమలతో ఆడుతూ
గడపాలనుకునే ఆనందం…

నిగూఢంగా దాచుకున్న
జ్ఞాపకాలను
తీరని కోరికల చిట్టాను
బయటకు తీసే జ్ఞాపకాల పుట్ట….

ప్రాణ స్నేహితులతో
మరపురాని మధురమైన రోజుల
గురుతుకై వారి కడకు
చేరాలనుకునే స్నేహబంధం..

తొలి ప్రేమను
జ్ఞాపకాల దొంతర నుండి
బయటకు తీసి మురిసె
మరచిపోలేని ప్రేమతలపు ..

వేదాంతిలా ఒంటరిగా
ప్రపంచాన్ని చుట్టి రావాలని
మనసుని ప్రపంచానికి దగ్గర చేయ
యోచించే ప్రకృతి ప్రేమ..

భాగస్వామికన్నా ముందుగా
సెలవు తీసుకోవాలనుకుని
ఎవరికి వారు తమ అదృష్టాల లెక్కలు
నెమరు వేసుకునే తియ్యని భావాలు ..

వెరసి యాభై వసంతాల కాలం
తీపి చేదు కలయికల మధుర సారం
మరువలేని జ్ఞాపకాల భాండాగారం.

రచయిత :: విజయ మలవతు

You May Also Like

One thought on “మరపురాని పేజీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!