ప్రకృతి ఆగ్రహించింది

ప్రకృతి ఆగ్రహించింది

ప్రకృతిని పాడుచేసి
పంటపొలాలను నాశనం చేసి
ఫ్యాక్టరీలు కట్టాడు
భవంతులు నిర్మించాడు
అడవులని నరికేసి
కొండలన్ని తవ్వేసి
రహదారులు వేశాడు
వనాలకి తావు లేదు
అరణ్యాల ఊసు లేదు
అందుకే కాబోలు
మనిషి చేసే ఆగడాలకు
ప్రకృతి మాత ఆగ్రహించింది
విలయ తాండవం చేస్తోంది
కరోనా రక్కసి కోరల్లో
చిక్కుకుని ప్రపంచం విలవిలలాడుతోంది
కాలం కాటేసింది
మనిషి ప్రాణాలను బలి తీసుకుంటోంది
మానవత్వం ఊసు మరిచిన మనిషిని
తన కర్కసత్వంతో కాటు వేస్తోంది
బంధాలను విస్మయించి కరుడు కట్టిన మనిషినీ
గదిలో బందీగా చేసి తన సత్తా చాటుతోంది
ఇప్పటికైనా కళ్లు తెరుద్దాం
ప్రకృతిని కాపాడుకుందాం
మన జాగ్రత్తలో మనం ఉందాం
ప్రాణాలను అరచేత పెట్టుకుని
రక్షణ కోసం భగవంతుడిని ప్రార్ధిద్దాం!!

రచయిత: పరిమళ కళ్యాణ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!