పడతి పంచభూతాలు

పడతి పంచభూతాలు

ఆమె మనసు దాహం తీర్చే మంచినీరు..
అదే కళ్లెర్రజేస్తే ఉప్పెనై ముంచేయగలదు..

ఆమె సహనం భూదేవిలాంటిది..
అదే సహనం కోల్పోతే భూమిలో కప్పేయగలదు..

ఆమె ప్రేమ ఆకాశం అంత గొప్పది..
ఆ ప్రేమని చులకన చేస్తే మిన్ను విరిగి మీద పడగలదు..

ఆమె స్నేహం చేస్తే వెచ్చని చలిమంట..
స్నేహాన్ని హద్దుమీరితే నిలువునా కాల్చేసే చితిమంట..

ఆమె అల్లరి పిల్ల తెమ్మర గాలి..
ఆకతాయి అల్లరి చేస్తే నిను చుట్టేసే సుడిగాలి…

రచయిత :: హసీనాఇల్లూరి

You May Also Like

2 thoughts on “పడతి పంచభూతాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!