చైతన్య కణిక*

 *చైతన్య కణిక*

ఒంటరై వచ్చావు  

ఒంటరై వెడతావు  

గత జన్మ  గురుతులేదు 

భవితనీకు తెలియరాదు 

నేటి హితులు సుతులు

భవ బంధాలు 

నిక్కముగ కాదు కాదు 

శాశ్వతము…..

 

ఎవరికెవరు ఈ జగతిని 

*నీ దేహబలం  ధనబలం*

*నీ వారినిచూపు ఇంద్రజాలం*

*నీ రుగ్మతలు  బలహీనతలు*

*నీ లేమి నీ దైన్యం నీ పొరబాట్లు*

*ఓర్చగలిగితే ఒక్క క్షణం ….

*బంధమనుకో  జగతిన*

*లేకున్న బాధ్యతనుకో*  …….!!

 

*కృతజ్ఞత మరిచిన లోకం*

క్షమించేసేయ్ ఆశించక 

*నీ ధర్మమే నీకు రక్ష అనుకో*

కన్నీటి సంద్రాలు  

నీవు పెంచుకునే  బంధాలు 

బంధనాల బాంధవ్యాలు  

మిథ్యా జగతిన మాయా నాటకాలు  .. !!!

 

శాంతి నివ్వని ప్రేమలు

ప్లాస్టిక్ పువ్వుల పరిమళాలు  

ఆశనిపాతమవ్వకు మానసా…!

*మనసే….శూన్యమవ్వగా*

నిశ్చలమై  సాగనీ బతుకు నావ  

జగత్ సంద్రాన లక్ష్యమే దిశగా…!! 

*ఎవరినీ ఏమాశించక*

 

ఎన్నోఉగాదులు ఎన్నెన్నో  

ఆశలకు పునాదులు  

నీ సంకల్పం నీ దీక్ష నీ స్వచ్ఛత  

నీవు దిద్దుకునే  తలరాత 

విధి అయిన అబ్బురపడు క్షమత

సాగిపో చైత్రమై  వసంతమే  

నిత్య కర్మఠవై చైతన్య కణికవై

                    రచన: రమాదేవి కులకర్ణి 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!