సమరసింహారెడ్డి సోదరి

సమరసింహారెడ్డి సోదరి

రోకలి బండతో కారం కొట్టిన సేతులివి…

ఇసుర్రాయితో పిండి ఇసిరిన సేతులివి…!

 

గోడకి పిడకలు కొట్టిన సేతులివి…

బండెడు అంట్ల గిన్నెల్ని తోమిన సేతులివి…!

 

కేజీ పిండిని రుబ్బురోలుతో రుబ్బిన సేతులివి…

బుట్టెడు బట్టల్ని ఎడాపెడా బాది ఉతికిన సేతులివి…!

 

అన్నాయం సేసినోడి గల్లా పట్టి కొట్టిన సేతులివి…!

ఏటనుకున్నారో…!

 

బాహుబలికి వేలువిడిచిన బంధువును నేను…

సమరసింహారెడ్డి సోదరిని నేను…!

 

అయ్యా…!

మామిడి కాయలు కొట్టడానికి రమ్మన్నారట…

కొబ్బరిబోండాలు మాత్రమే కాదు…

మామిడికాయలు కూడా కొడతానయ్యా నేను…

అందుకే కత్తితో సహా వచ్చానయ్యా…!!!

                                                                                                                                 రచన: చంద్రకళ. దీకొండ

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!