అక్షరం
అక్షరాల పూదోటలో
విరబూసిన భావాలెన్నో
అక్షరాలు పదాలుగా
సమకూరిన అర్ధాలెన్నో
అక్షరాల అమరికలో
గూడుకట్టుకున్న జ్ఞాపకాలెన్నో
అక్షరాల ప్రోద్బలంతో
సాధించిన విజయాలెన్నో
అక్షరాల పదనిసలో
చిగురించిన ప్రేమలెన్నో
అక్షరాల పందిరిలో
మాయమైన బాధలెన్నో
అక్షరమే ఆయుధమై
నడిపించెను గుండెలనెన్నో
అక్షరమే ఓదార్పుగా
చిగురించిన జీవితాలెన్నో
అక్షరమే నమ్మకంగా
చేరుకున్న గమ్యలెన్నో
అక్షరమే చరిత్రగా
నిలబడిన కాల పుటలెన్నో
అక్షరమే భావంగా
పురుడుపోసుకున్న పుస్తకాలెన్నో
అక్షరమే ఆనంతమై
సమకూర్చిన విజ్ఞానాలెన్నో
రచన: జ్యోతి రాణి