కార్పొరేటు విద్య

కార్పొరేటు విద్య

రచయిత :: మీసాల చిన గౌరినాయుడు

ఓ తెలుగులమ్మా!!
శీర్షిక:కార్పొరేట్ విద్య

పిల్లల అగచాట్లు
పెద్దల గ్రహపాట్లు
అమ్మో కార్పో”రేట్లు”
ఓ తెలుగులమ్మా!!

భారమైన చదువు
విరామమే కరువు
చదువేమో బరువు
ఓ తెలుగులమ్మా!!

పెంచుతోంది  క్రేజు
ముంచుతోంది మోజు
దంచుతోంది ఫీజు
ఓ తెలుగులమ్మా!!

రేపుతారు ఆశలు
పలుకుతారు కోతలు
చూపుతారు చుక్కలు
ఓ తెలుగులమ్మా!!

తెలుసుకోరు జనం
తరిగిపోవు ధనం
బలియాయెను మనం
ఓ తెలుగులమ్మా!!
~~~~~~

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!