నెచ్చలి ప్రేమ సందేశం

నెచ్చలి ప్రేమ సందేశం

 

తెల్లని మరుమల్లియంటి 

కాగితంపైన కలమంచు

కవాతుగా కదలాడగా… 

 

సొంపైన నల్లటి చేతి వ్రాత 

ముత్యాలుగా జాలువారిన

నా మది మెచ్చిన మగని 

మనసులోని ఊసులన్నీ …. 

 

కమనీయ కవనాలై విరబూసి

కాలంతో  అట పయనిస్తూ….

సుమ పరిమళాల గుబాళింపు

నింపుకన్న మలయ సమీరాల

తోడుగా.. చల్లగ జత కూడగా.. 

 

చెలికాని చిలిపి కవ్వింపుల జతకోరి..

విరహాన వేగుతూ..ఎదురుకోలుగా…

వేచియున్న ఈ నెచ్చెలి హృదయాన్ని 

 

ప్రేమ సందేశమై చేరి..మురిపించగా…

ఆత్మీయ పలకరింపుగా మది లోతులను

మెల్లగా తడిమి…మైమరపించగా… 

 

అలముకున్న మాటలకందని  

ప్రియ పరవశం..ఎంత మధురమో…

బాసలకందని సమ్మోహనాల

సుమభావన..ఎంతెంత ప్రియమో…

                         రచన:సత్య కామ ఋషి’రుద్ర’

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!