అమ్మకు వందనం

(అంశం:: అమ్మ)

అమ్మకు వందనం 

రచన:పిల్లి.హజరత్తయ్య

పల్లవి:
ఆత్మీయత అనుబంధాలు విరబూసిన అమ్మ
ఆప్యాయత అనురాగాలు కలబోసిన రెమ్మ

అను పల్లవి:
మా ధ్యాసే నీ ధ్యానం- మా శ్వాసే నీ ప్రాణం
అమ్మకు వందనం- పాదాభివందనం

చరణం.1
బిడ్డకు జన్మనివ్వడానికి- పునర్జన్మ నెత్తుతుంది
బ్రతుకు నివ్వడానికి- దేవుడిని మ్రొక్కుతుంది
బిడ్డకు సుస్తీ చేస్తే -నిద్రాహారాలు మానుతుంది
విజయాన్ని సాధిస్తే -ఆనందంతో నవ్వుతుంది /అమ్మకు వందనం/

చరణం:2
బిడ్డ ఏడిస్తే- లాలిపాటతో కట్టిపడేస్తుంది
మారాం చేస్తే- లాలించి బుజ్జగిస్తుంది
తప్పులు చేస్తే -నిందలను భరిస్తుంది
మారాం చేస్తే – లాలించి బుజ్జగిస్తుంది /అమ్మకు వందనం/

చరణం:3
కొవ్వొత్తిలా కరుగుతూ -వెలుగును పంచుతుంది
నీడను ఇస్తూ- కల్పవృక్షమై రక్షిస్తుంది
ఎదలోతులను తాకుతూ స్వరాలను పలికిస్తుంది
లాలిపాట పాడుతూ -పులకించిపోతుంది /అమ్మకు వందనం/

చరణం:4
ఆత్మవిశ్వాసం సన్నగిల్లినా- భరోసా నిస్తుంది
కంటిచెమ్మ తన్నుకొస్తున్నా- తొక్కిపెట్టి నవ్వుతుంది
ఆందోళన వెంటాడినా- బాధ్యతతో నడుస్తుంది
మరణం ఆహ్వానించినా- నవ్వుతూ ఎదురెళుతుంది /అమ్మకు వందనం/

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!