విశిష్ట వ్యక్తిత్వం

(అంశం:: వ్యక్తిత్వ వికాసం)

విశిష్ట వ్యక్తిత్వం 

రచన:పిల్లి.హజరత్తయ్య

వెలవెలబోతున్న జీవితానికి వెలుతురై
భవిష్యత్తుకు పూలబాటలు వేస్తూ
మానవుని మహనీయుడుగా మార్చే
అద్భుతమైన సాధనమే వ్యక్తిత్వము..!

స్వకీయమైన స్వధర్మంతో
సమయపాలనను పాటిస్తూ
పథకాలు వేసుకుంటూ సాగుతూ
క్రమశిక్షణతో మెలగడమే వ్యక్తిత్వము..!

అందం లేకున్నా అందరినీ ఆకర్షిస్తూ
అందరినీ మెప్పించే వాక్చాతుర్యం ప్రదర్శిస్తూ
వినయవిధేయతలతో తృప్తిని కలిగించే
నడవడిక కలిగి ఉండడమే వ్యక్తిత్వము..!

మనసనే తెల్ల కాగితంపై
సరియైన ప్రవర్తననే అక్షరాలను లిఖించిన
సువాసన అనే పరిమళాలను
విశ్వమానవాళిపై వెదజల్లుతుంది వ్యక్తిత్వము..!

ఆభరణం లాంటి వ్యక్తిత్వంతో
మనసును గెలిస్తే జీవితం మెరుస్తుంది.!
ఇతరులు పొరపాట్లను సహనంతో అంగీకరిస్తే
సమాజం నీకు దాసోహమవుతుంది..!

తాను బాధపడక
ఇతరులను బాధించక ముందుకు సాగితే
విశిష్టమైన వ్యక్తిత్వం వృద్ధి చెంది
జీవితం శోభాయమానమవుతుంది..!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!