మృగాళ్ళున్నారు జాగ్రత్త

మృగాళ్ళున్నారు జాగ్రత్త

 

మగాళ్ళం కాదు మృగాళ్ళం మేము.. 

మనుషులం కాదు పశువులం మేము..

నీతులం కాదు నీచులం మేము…..

 

కన్నపేగు బంధం లేదు.

కూతురన్న ప్రేమ లేదు..

జాలికసలు జాగా లేదు..

కన్నేస్తే కాటేస్తాం,  చనువిస్తే చరిచేస్తాం…..

 

ప్రేమంటూ వెంటపడతాం…

ఒప్పుకుంటే కడుపు చేస్తాం..

కాదంటే యాసిడేస్తాం..

జైలుకెళ్తే మైనర్ అని  బయటపడతాం..

తిరిగొచ్చి మళ్ళీ మొదలెడతాం…

 

వయసుతొన పని లేదు..

వావి వరుస లేనే లేవు..

ఆడదైతే చాలు మాకు..

శవమైతే ఏంటి మాకు సుఖమిస్తే చాలు చాలు… 

కోరికంత తీరగానే కిరోసిన్ వేసి కాల్చేస్తాం… 

దేవుడంటే భయం లేదు వాడు కూడ  మగాడేగా… 

 

తల్లి పొత్తిలైన,  తండ్రి నీడైనా 

అన్న అండైనా,  స్నేహితుడి సహచర్యమైన 

లేనే లేదు రక్ష మీకు 

ఈ చట్టం వేయలేదు శిక్ష మాకు

                                      రచన:రామ్ ప్రకాష్

You May Also Like

One thought on “మృగాళ్ళున్నారు జాగ్రత్త

  1. ప్రస్తుత సమాజానికి అద్దంలా ఉంది మీ కవిత 👏👏👏 రామ్ ప్రకాష్ గారు 😊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!