ప్రేమ మాయ
రచయిత :: సుజాత.కోకిల
నా కళ్లు తెరిచి చూడగానే ఏంటో ఎప్పుడు
నీవ్వే గుర్తుకొస్తున్నావు…
ఏ మాయ చేసావో కానీ నా కనులలో
నీవే నిండి ఉన్నావు…
అద్దంలో చూసుకున్నా నీ రూపమే కనబడుతుంది
ఎందుకనో…
ఇట్టే వస్తావు నన్ను పలకరించి కవ్వించి ఇట్టే మాయమవుతావు…
అందమైన ప్రకృతి వెన్నెలలో నా లేలేత బుగ్గలపై
ముద్దాడి నన్ను ఉక్కిరిబిక్కిరి చెస్తావు…
ఏ పూవ్వు కోసినా నీవే పలకరించినట్టుగ నీ చిరునవ్వే కనబడుతుంది…
నీ మాటలు నీ చిరునవ్వు నాకు ఎంతో ధైర్యాన్ని బలాన్ని ఇస్తుంది…
చీకటి అనుకున్న నాలో వెన్నెల చికటి రెండు ఉంటాయని నిరూపించావు…
నిన్నే తలుస్తూ నీ ఊహాల్లోనే నే బ్రతుకుతున్న…
నన్ను నేనే మరిచి నా లోకంలోనే విహారిస్తున్నాను…
నన్ను ఏంటో పిచ్చిమా లోకం అంటున్నారు…
అదేదో నాకు ఏం తెలియదు నన్ను పిచ్చి అనుకున్నా పర్వాలేదు…
అదే పిచ్చి నా ప్రేమ పిచ్చి అదే నా లోకం నా ప్రేమ
ప్రపంచం…