రక్షక కవచము వైద్యుడు
రచన ::పిల్లి.హజరత్తయ్య
దేవుడు జన్మను ప్రసాదిస్తే
సుస్తీ చేసిన ఆరోగ్యానికి
నిత్యం వైద్యం చేస్తూ
పునర్జన్మ నిచ్చే దైవము..!
తన ప్రాణాలను సైతం లెక్క చేయక
రోగగ్రస్తుల ఆరోగ్యం కోసం
నిరంతరం శ్రమించి ప్రాణం పోసే
రక్షక కవచం వైద్యుడు..!
ప్రాణాంతక వ్యాధులపై సమరంలో
కంటిమీద కునుకు లేకుండా
ఆరోగ్య భద్రతలో సమిధులై
అందరికీ ఆయుష్షు పోసే దివ్యతేజము..!
కారు మబ్బులు కమ్మిన జీవితాలలో
ఆశల దీపాలను వెలిగిస్తూ
వైద్య అమృతమును అందించి
స్వస్థత చేకూర్చే పవిత్ర రూపం
సమస్త రోగాలను నివారించి
ఆరోగ్యమనే మహాభాగ్యానిస్తున్న
ఈనాటి ఆధునిక వైద్యం
రోగుల పాలిట పరమ నైవేద్యం..!
***