దివ్య ఔషధం యోగ 

దివ్య ఔషధం యోగ 

రచన ::పిల్లి.హజరత్తయ్య

వ్యాయామ సాధనల సమాహారం
ఆధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది
మానసిక ఆరోగ్యానికి చక్కగా
ఉపయోగపడే దివ్యౌషధం యోగ..

దారంలో మణులను చేర్చినట్లు
యోగశాస్త్రాన్ని పతంజలి ఒక చోటకు చేర్చి
శరీర దారుఢ్యానికి కావలసిన సూత్రాలను
పొందుపరిచిన గ్రంథం అష్టాంగయోగం..

ప్రాణాంతక వ్యాధులపై పోరులో
అస్వస్థతకు స్వస్థత చేకూర్చి
వ్యాధినిరోధక శక్తిని పెంచే
అద్భుతసాధనాలు సూర్యనమస్కారాలు..

సూర్యభేదన,ఉజ్జాయి,శీతలి
భస్త్రిక,భ్రామరి లాంటి ప్రక్రియలు
ప్రాణాయామ సాధనలో ప్రధానాలు
మానసిక ఆరోగ్యానికి దివ్యసాధనాలు..

జలంధర,మూల ఉడ్యాన బంధాలు
మహా,మహా భేద,మహాబంధ ముద్రలు
ధవతి,నేతి వస్తి వంటి క్రియలు
వ్యాధి తీవ్రత తగ్గుదలకు ఉత్తమమైన విధానాలు..

కోట్ల ఆస్తులున్నా భద్రత లేని జీవితానికి
ఆరోగ్య భరోసా ఇచ్చేది యోగానే
జీవితంలో ఆసనాలను తప్పక ఆచరించి
ఆరోగ్య భద్రతను పెంచుకోండి..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!