ఛత్రపతి శివాజీ

ఛత్రపతి శివాజీ

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

అరుణ డేనియల్
బెంగళూరు
9000606889
తల్లి జిజాబాయి
ఉగ్గు పాలతో నేర్పిన వీరత్వం
నరనరాల్లో నింపుకున్న
మరాఠా సామ్రాజ్యన
వెలసిన యోథుడు
ఛత్రపతి శివాజీ

చిన్నతనం నుండి
రామాయణ
మహాభారతం
ఔపొసనపట్టి
భవానీ మాత
ఆశీస్సులతో
కదం తొక్కిన
మహావీరుడు
ఛత్రపతి శివాజీ

దాదాజీ కోండియో
భాజీప్రభు
తానాజీల
సహకారంతో
అప్రతిహతంగా
సొగిన
రాజకీయ దురంధరుడు
ఛత్రపతి శివాజీ

ఆదిల్ షాని
ముప్పతిప్పలు పెట్టి
అఫ్జల్ ఖాన్ ని
చీల్చి చెండాడిన
సాహసి
ఛత్రపతి శివాజీ

యుద్ధంలో పట్టుబడిన వారిని
సగౌరవంగా బహుమానాల తో
సాగనంపిన ఘనత శివాజీ దే
యుద్ధం లో పట్టుబడిన స్త్రీలను
సోదరిగా భావించి సాగనంపిన
ధీరుడు ఛత్రపతి శివాజీ

ఔరంగ జేబునే
ఔరా అనిపించిన
రాజకీయ చతురత
ప్రదర్శించి
ఒకవైపు బీజాపూర్ సుల్తాన్
ఇంకోవైపు మొగలు చక్రవర్తులను
ఎదుర్కున్న మహాథీశాలి
ఛత్రపతి శివాజీ

నువ్వు పుట్టగానే
పరిమళించినట్లుగా
మహీరాష్ట్రుల
వీరాధివీరుడు
మరాఠా సామ్రాజ్య
వ్యవస్థాపకుడు
ఛత్రపతి శివాజీ
మహారాజ్
జయహో
జయహో

ప్రపంచాన్ని
ఆశ్చర్యం లో ముంచెత్తే విధంగా
శత్రుదుర్భేధ్యమైన
సింధుదుర్గ్
ప్రతాప్ గఢ్
రాయగఢ్
కోటలు కట్టిన
పోరాటం యోధుడు
ఛత్రపతి శివాజీ

మరాఠా ప్రజల సాక్షి గా
మహారాష్ట్ర సాక్షి గా
ప్రజల గుండెలలో
శాశ్వతంగా నిలిచిపోయిన
వీరుడు
శూరుడు
ఛత్రపతి శివాజీ
జయహో

*******

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!