బాపూజీ 

బాపూజీ 

రచయిత :: ప్రసాదరావు రామాయణం

అడుగడుగడుగో
అతడే అతడే!
అర్ధనగ్నంగా ఉన్నాడే
అంగవస్త్రంతో
నీలా బోసినవ్వు
పాలలా పోస్తున్నాడే
వెన్నెలంతా నోట నింపుకుకుని…
రివటలా వున్నాడు చూడు
గట్టిగా గాలివీస్తే
ఎగిరిపోతాడెమో కదా
అందుకే కర్ర పట్టుకున్నాడేమో!
ఆ బొమికెల గూడులో
ఎంత తేజమోగదా!
మిట్టమధ్యాహ్నపు మార్తాండునిలా
ఆ గుండూ,ఆ సోడాబుడ్డి అద్దాలూ
అతడేరా చిన్నా అతడే
ఆంగ్లేయులకు బెదురు పుట్టించాడు
బ్రిటీషువారిని గెంటివేశాడు
యుద్ధం చేసి.కాదు నాన్నా
అణు బాంబుకన్నా భయంకరమైన
శాంతి మంత్రంతో!
అహింసా వాదంతో
అలాటి వాడు ఈ భూమిపైనే
తిరిగాడంటే ఆశ్చర్యంగా లేదూ!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!