వర్ష గీతిక
రచయిత :: డా.సి.హెచ్.ఆంజనేయులు
మబ్బుల ఉరుముల మెరుపుల శబ్దాలు
డమడమ ల గడ గడగడ ల
చకిత విన్యాసాల
నా హృదిలో పొంగే
వర్షం ఆనందడోలికల్లో ఊగిపోతూ ఉన్నాను
మనో మందిరములో సంతోషాల సాగరంలో మునిగి తేలుతున్నారు
భావ లయల విన్యాసం మధుర జ్ఞాపకాలతో రణం
జీవన మధుర స్వప్నాలు ఆనందం మరిపించే రాగ తరంగం
ఈవేళ వర్షం హర్షం మనోహర ఇంద్రధనస్సు ల తోరణాలు
ఆకాశ లోగిలిలో విరిసే మెరుపుల తారలు దిగివచ్చిన గగనం వంగి నాపై పూల బాణాలు విరుస్తున్నాయి
ఇది మధుర జ్ఞాపకాలు తీరం.
***