ధైర్యమే ఆయుధం

ధైర్యమే ఆయుధం

రచయిత :: శివానంద వింజమూరి

మూలాలను శోధించాలి….
మందిని మింగేస్తున్న ఈ మహమ్మారిని అరికట్టాలి.
మనుషులనే పగబట్టి ప్రాణాల్ని పిండేస్తున్న,
చుట్టూ ఉన్న నా ప్రాణవాయువునే నాకందనీయని,
క్షణాలలో ప్రాణాలను ఎగరేసుకు పోతున్న ఈ జాడ్యాన్ని,
కడచూపుకు కూడా కరుణించని ఈ క్రూర జంతువును,
కంటిపాపలాంటి కొండంత ఆశలను తుంచేస్తున్న ఈ క్రిమిని,
ఈ భూమిపై భస్మాసుర అస్త్రాన్ని ప్రయోగిస్తున్న ఈ భూతాన్ని,
భవిష్యత్తుపై నల్ల తివాచీపరిచి నర్తిస్తున్న ఈ రక్కసిని,
మనమంతా కలిసి ఎదిరించాలి….
కరోన మన దరి చేరకుండా ఉక్కు సంకెళ్ళలో బంధించి ఉరి తీయాలి.
పాతాళానికి తొక్కేయ్యాలి….దీనికై,
నరాలను బిగించి, రక్తాన్ని ఎరుపెక్కించి శ్రీ శ్రీ చూపించిన
మరో ప్రపంచం వైపు మహాప్రస్థానం బాట‌ పట్టాలి…
చిమ్మచీకటిలో, గోతుల దారిలో, దూరంగా ఉన్న ఇంటిని
ధైర్యాన్ని ఆయుధంగా చేసుకునే మార్గం చెప్పిన
తిలక్ గారి కవచాన్ని ధరిద్ధాం…. శత్రువును గెలుద్దాం…
ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించిన మనం
తప్పులను సరిదిద్దుకుని సరైన మార్గంలో పోతూ…
భూతదయ కలిగి…..
సర్వేజనా సుఖినో భవంతు అనే సూత్రంతో సాగుదాం..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!