మహోన్నత శిఖరమతడు.!

(అంశం:”అబ్దుల్ కలాం”)

 మహోన్నత శిఖరమతడు.!

-పిల్లి.హజరత్తయ్య

సామాన్య కుటుంబంలో జన్మించి
అసమాన్య నైపుణ్యంతో
మెరిసిన మహోన్నత శిఖరమతడు..

దేశ శ్రేయస్సు కోసం
నిస్వార్థ ఒంటరి జీవితాన్ని
ఎంచుకున్న సేవా రూపమతడు..

దేశానికి సేవలందించడానికి
సమిధగా మారిన
సిసలైన భారతరత్న మతడు..

దేశాన్ని వైజ్ఞానిక ప్రబలశక్తిగా మార్చడానికి
రాజీలేని పోరాటం చేసిన
నిత్య కృషీవలుడతడు..

విద్యా లోకంతో మమేకమై
సుగంధ పరిమళాలను వెదజల్లి
విద్యా దినోత్సవమై మెరిసిన
సరస్వతీ పుత్రుడతడు..

కలలు కనండి అంటూ
కష్టాల్లోనే విజయాన్ని వెతకండంటూ
జీవిత సారం బోధించిన
అపర జ్ఞాని అతడు..

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!